Suji:  మగ తోడు దొరకక... హైదరాబాద్ జూలో కన్నుమూసిన చింపాంజీ!

Chimponje Suji Died in Hyderabad Zoo
  • గతంలో హైదరాబాద్ కు వచ్చిన సుజీ
  • నిద్రలోనే గుండెపోటుతో మరణం
  • దిగులు చెంది ప్రాణాలు వదిలిందన్న అధికారులు
హైదరాబాద్ లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో ఆడ చింపాంజీ సుజీ, ఒంటరి తనాన్ని భరించలేక గుండెపోటుతో కన్నుమూసిందని క్యూరేటర్ వెల్లడించారు. దీని వయసు 34 సంవత్సరాలు. నిన్న ఉదయం 8.30 గంటలకు యానిమల్ కీపర్లు చూసే సమయానికి సుజీ చలనం లేకుండా పడివుంది. ఇది నిద్రలోనే మరణించిందని అధికారులు వెల్లడించారు.

కాగా, ఇక్కడి మగ చింపాంజీలకు తోడు కోసం దీనిని నెహ్రూ జూ పార్క్ కు గతంలో తీసుకుని వచ్చారు. అయితే, ఇక్కడి రెండు మగ చింపాంజీలు గతంలో మరణించడంతో, మళ్లీ సుజీకి మగతోడు దొరకలేదు. ఈ కారణంతోనే దిగులు చెందిన సుజీ, చివరకు కన్నుమూసిందని అధికారులు తెలిపారు.
Suji
Nehru Zoological Park
Hyderabad
Chimponjee

More Telugu News