Tamilnadu: తమిళనాడులో రౌడీల వేట... మూడు రోజుల్లో 150 మంది అరెస్ట్!

Tamilnadu Police Arrest 150 Culprits in 3 days
  • అరెస్టయిన వారిలో పాత నేరస్థులు కూడా
  • పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు సోదాలు
  • చెన్నై పరిధిలో ఎంతో మంది అరెస్ట్
ఈ దీపావళి సీజన్ లో తమిళనాడులో చైన్ స్నాచింగ్ లు తదితర చోరీలను నివారించేందుకు మూడు రోజులుగా ప్రత్యేక వేట సాగించిన పోలీసులు, సుమారు 150 మందిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన ఉన్నతాధికారులు, గతంలో వారెంట్లు జారీ అయి, పరారీలో ఉన్న నేరస్థులు కూడా వీరిలో ఉన్నారని, చెన్నై పోలీసు కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్ ఉత్తర్వుల మేరకు నగర పరిధిలో రౌడీల కోసం ముమ్మరంగా వేటను కొనసాగించినట్టు తెలిపారు.

ఇందులో భాగంగా, చెన్నై దక్షిణ ప్రాంతంలో 20 మంది, పశ్చిమ ప్రాంతంలో 12 మందిని అరెస్ట్ చేశామని, బుధవారం రాత్రి మరో 33 మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఆపై టీ-నగర్ లో 28 మంది, మౌంట్ రోడ్ లో 23 మంది, అడయార్, ట్రిప్లికేన్ ప్రాంతాల్లో 19 మంది, మైలాపూరులో 10 మంది పట్టుబడ్డారని వెల్లడించారు.
Tamilnadu
Chennai
Arrest
Culprits

More Telugu News