India: దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోన్న భారత్!

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిపుణుల అంచనా
  • ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం క్షీణత 
  • రెండో త్రైమాసికంలోనూ 8.6 శాతం క్షీణించే అవకాశం 
India enters in  Financial crisis

భారత ఆర్థిక వ్యవస్థ కరోనా కారణంగా బాగా దెబ్బతింది. వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటు క్షీణించింది. దీంతో భారత చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశం‌ ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెట్టబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌లో ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం క్షీణించింది. రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లోనూ వృద్ధిరేటు 8.6 శాతం క్షీణించే అవకాశాలున్నట్లు ఆర్‌బీఐ నౌకాస్ట్‌ విధానంలో వేసిన  అంచనాల్లో నిపుణులు తెలిపారు. సాంకేతికంగా దేశం ఆర్థిక మాంద్యంలోకి జారుకుందని మానిటరీ పాలసీ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి పంకజ్‌ కుమార్‌ ఎకనామిక్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పేరుతో రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు.

దశలవారీగా దేశ ఆర్థిక కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తే ఆర్థిక పరిస్థితి దిగజారకుండా నియంత్రించవచ్చని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపులతో మే, జూన్‌ నెలల్లో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకొందని తెలిపారు. నౌకాస్ట్ విధానంలో ఆర్థిక రంగంలోని వేర్వేరు సమాచారాన్ని విశ్లేషించి నిపుణులు ఈ అంచనాలకు వచ్చారు. అయితే, జులై-సెప్టెంబరు త్రైమాసిక గణాంకాలను ఆర్‌బీఐ ఇంకా విడుదల చేయలేదు.

More Telugu News