Budda Venkanna: టీడీపీ లాయర్ల శక్తిపై అంత నమ్మకం ఉంటే జగన్ కేసుల్లో వాదించడానికి వాళ్లనే పెట్టుకోండి: బుద్ధా వ్యంగ్యం

Buddha opines on bail issue Nandyal suicide case
  • నంద్యాల ఆత్మహత్యల కేసులో పోలీసులకు బెయిల్
  • టీడీపీ లాయర్ వల్లే బెయిల్ వచ్చిందన్న వైసీపీ
  • బెయిల్ ను ఎందుకు అడ్డుకోలేకపోయారని బుద్ధా వ్యాఖ్యలు
నంద్యాల ఆత్మహత్యల కేసులో అరెస్టయిన సీఐ, హెడ్ కానిస్టేబుల్ కు టీడీపీ న్యాయవాది వల్లే బెయిల్ వచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు.

టీడీపీ లాయర్లకే అంతశక్తి ఉంటే అచ్చెన్నాయుడుకు బెయిల్ రావడానికి మూడు నెలలు, కొల్లు రవీంద్రకు బెయిల్ రావడానికి రెండు నెలలు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు బెయిల్ రాకుండా నెలల తరబడి అడ్డుకోగలిగిన ప్రభుత్వం నంద్యాల నిందితుల విషయంలో 12 గంటలు కూడా ఎందుకు ఆపలేకపోయిందని నిలదీశారు.

టీడీపీ లాయర్ల శక్తిపై అంత నమ్మకం ఉంటే జగన్ అవినీతి కేసుల్లో వాదించేందుకు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద న్యాయవాదులను కోట్లు గుమ్మరించి తెచ్చే బదులు వీరినే పెట్టుకోండి అని బుద్ధా సెటైర్ వేశారు.
Budda Venkanna
Bail
Police
Nandyal
Lawyer
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News