Kajal Agarwal: స‌ముద్ర‌పు అందాల‌ నడుమ భర్తతో హీరోయిన్ కాజ‌ల్.. హనీమూన్ ఫొటోలు వైరల్

kajal pics go viral
  • గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న హీరోయిన్ కాజల్ 
  • మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న జంట 
  • ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ముద్దుగుమ్మ 
ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను హీరోయిన్ కాజల్ అగర్వాల్  గత నెల 30న పెళ్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఆమె.. మాల్దీవుల్లోని అందాలను ఆస్వాదిస్తోంది. సముద్ర‌పు అందాల నడుమ భర్తతో కలిసి గడిపి, ఫొటోలు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
   
తమ హ‌నీమూన్ షెడ్యూల్‌ని మ‌రి కొన్ని రోజులు ఈ దంపతులు పొడిగించుకోనున్న‌ట్టు సమాచారం. కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు పారిస్ పారిస్, భార‌తీయుడు 2, ముంబై సాగా వంటి పలు సినిమాల్లో నటిస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల సినిమా షూటింగులు బంద్ అయిన నేపథ్యంలో ఈ సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది కాజల్. త్వరలోనే ఆమె తిరిగి షూటింగుల్లో పాల్గొననుంది.  

     
Kajal Agarwal
Tollywood
Viral Pics

More Telugu News