Whitehouse: వైట్‌హౌస్‌లో కరోనా కలకలం.. మరో ఉద్యోగికి సోకిన మహమ్మారి

Another employee in white house infected to corona
  • అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత వైట్‌హౌస్‌లో తొలి కేసు
  • శ్వేతసౌధంలో ఇటీవల పలువురికి సోకిన మహమ్మారి
  • మరొకరికి కూడా వైరస్ సోకిందంటున్న స్థానిక పత్రికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌లో ఓ ఉద్యోగి కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. అమెరికా పొలిటికల్ డైరెక్టర్ బ్రియాన్ జాక్స్ కు కరోనా సోకినట్టు తాజాగా నిర్ధారణ అయిందని, అయితే, ఎన్నికల రోజు రాత్రి జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నదీ, లేనిదీ తెలియరాలేదని స్థానిక మీడియా పేర్కొంది.

చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్, గృహ, పట్టణాభివృద్ధి మంత్రి బెన్ కార్సన్, ఆయన సహాయకుడు డేవిడ్ బోసీ తదితరులు ఇటీవల కరోనా బారినపడ్డారు. తాజాగా బ్రియాన్‌తోపాటు మరొకరికి కూడా వైరస్ సోకినట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. కాగా,  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా, కుమారుడు బారన్ ట్రంప్‌లు ఇటీవల కరోనా బారినపడినప్పటికీ ఆ తర్వాత కోలుకున్నారు.
Whitehouse
Corona Virus
Donald Trump

More Telugu News