Balakrishna: ముద్దుల మనవడితో బాలకృష్ణ మురిపెం... వైరల్ అవుతున్న తాజా చిత్రం!

Balakrishna is With Grand Son Pic Viral
  • సంప్రదాయ దుస్తుల్లో తేజస్విని కుమారుడు
  • ఒళ్లో కూర్చోబెట్టుకున్న బాలయ్య
  • మనవళ్లతో సరదాగా గడుపుతున్న బాలకృష్ణ
తన మనవడు, చిన్న కుమార్తె తేజస్విని కుమారుడితో నందమూరి బాలకృష్ణ ఉన్న ఓ లేటెస్ట్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఖాళీ దొరికినప్పుడల్లా తన మనవళ్లతో గడిపేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారన్న సంగతి తెలిసిందే. బాలయ్యకు ఇద్దరు మనవళ్లు ఉన్నారు. వారు చేసే అల్లరి గురించి తనకు వీలైనప్పుడల్లా బాలయ్య చెబుతూనే ఉంటారు. తాజా చిత్రంలో సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నోడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని బాలయ్య చిరునవ్వులు చిందిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.
Balakrishna
Grand Son
Viral Pics

More Telugu News