Andhra Pradesh: దీపావళి టపాసులపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు!

  • టపాసులకు రెండు గంటలు మాత్రమే అనుమతి
  • గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలి
  • ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా ఆంక్షలు
Restriction on Diwali Crakers in Andhra pradesh

కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాని వేళ, శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్న దీపావళిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని, శనివారం నాడు రాత్రిపూట కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు పేల్చుకోవాలని సూచించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే టపాకాయలను కాల్చేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

అవి కూడా పర్యావరణానికి మేలు కలిగించే గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే కాల్చాలని, రాష్ట్రంలోని కరోనా బాధితులు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇక టపాకాయలు విక్రయించే షాపుల మధ్య 10 అడుగుల దూరం తప్పనిసరని, కొనుగోలుదారులు కూడా 6 అడుగుల దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత షాపుల యజమానులదేనని వెల్లడించింది. ఈ షాపుల వద్ద పేలుడు స్వభావమున్న శానిటైజర్ లను వాడరాదని తేల్చి చెప్పింది.

More Telugu News