Vijayawada: విజయవాడలో అగ్నికి ఆహుతైన పాత ప్రసాద్ థియేటర్!

Fire Accident in Vijayawada Old Prasad Theater
  • చిట్టి నగర్ లో ప్రసాద్ థియేటర్
  • మూత పడివుండటంతో తప్పిన ప్రాణనష్టం
  • చుట్టుపక్కల ప్రజల ఆందోళన
విజయవాడలోని చిట్టినగర్ పరిధిలో ఉన్న పాత ప్రసాద్ థియేటర్ అగ్నికి ఆహుతైంది. ఇక్కడ గత అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే, గత కొంతకాలంగా థియేటర్ మూతపడివుండటం, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది మూడు ఫైరింజన్ లను తీసుకుని వచ్చి మంటలను ఆర్పారు. ప్రమాదం తీవ్రత అధికంగా ఉండటంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందారు.
Vijayawada
Old Prasad Theater
Fire Accident

More Telugu News