Raghu Rama Krishna Raju: రాంగోపాల్ వర్మతో రఘురామకృష్ణరాజు ఫన్నీ ఫొటోలు... ఇవిగో!

Raghurama Krishna Raju with Ram Gopal Verma
  • రఘురామకృష్ణరాజు, ఆర్జీవీ భేటీ
  • రఘురామ రాజకీయ గ్యాంగులో చేరుతున్నానంటూ వర్మ చమత్కారం
  • రఘురామకృష్ణరాజు రియల్ హీరో అంటూ కితాబు
గోదావరి జిల్లాల వెటకారం పలికించడంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దిట్ట. అలాంటి వ్యక్తి సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి సందడి చేశారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలను వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు పలు ఎక్స్ ప్రెషన్లను తన ముఖంలో పలికించారు. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టు వర్మతో కలిసి పోజులు ఇచ్చారు.

దీనిపై వర్మ స్పందిస్తూ.... ఆర్ఆర్ఆర్ (రఘురామకృష్ణరాజు) ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడో చెప్పగలరా? అని ప్రశ్నించారు. తాను కూడా రఘురామకృష్ణరాజు పొలిటికల్ గ్యాంగులో చేరుతున్నానని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి, రామ్ చరణ్, రామారావు (జూనియర్ ఎన్టీఆర్) లు కేవలం సినిమా వరకే పరిమితం అని, కానీ, ఆర్ఆర్ఆర్ అంటే రఘురామకృష్ణరాజేనని, ఆయన రియల్ హీరో అని పేర్కొన్నారు.
Raghu Rama Krishna Raju
RGV
Fun
YSRCP
Andhra Pradesh

More Telugu News