Sensex: రికార్డు స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 680 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 170 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 9 శాతం వరకు పెరిగిన బజాజ్ ఫైనాన్స్
Sensex touches record highs

దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఏడో రోజు ర్యాలీ కొనసాగింది. ఈరోజు మార్కెట్లు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయులను తాకాయి. కరోనాకు టీకా వస్తోందనే అంచనాలు, బీహార్ లో మరోసారి ఎన్డీయే గెలవబోతోందనే ట్రెండ్స్ తో మార్కెట్లు దూసుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 680 పాయింట్ల లాభంతో 43,278కి చేరుకుంది. నిఫ్టీ 170 పాయింట్లు పుంజుకుని 12,631 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (8.84%), ఎల్ అండ్ టీ (6.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (6.44%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (5.62%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.56%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-5.73%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-5.36%), నెస్లే ఇండియా (-4.08%), ఇన్ఫోసిస్ లిమిటెడ్ (-3.98%), సన్ ఫార్మా (-3.66%).

More Telugu News