Dubbaka: 11 రౌండ్ల అనంతరం దుబ్బాకలో పరిస్థితి ఇలావుంది!

Dubbaka by polls vote counting
షార్ట్స్‌లో చూడండి
దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముందుకు సాగేకొద్దీ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధ్యికంలో కొనసాగుతుండడమే అందుకు కారణం. తాజాగా 11వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ దఫా కూడా రఘునందనే ఆధిక్యంలో ఉన్నారు. 11 రౌండ్ల అనంతరం బీజేపీ ఓట్ల సంఖ్య 34,748 కాగా, టీఆర్ఎస్ 30,815, కాంగ్రెస్ పార్టీ 8,582 ఓట్లతో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి రఘునందన్ రావు ఆధిక్యం 3,933 ఓట్లు. ఇంకా 12 రౌండ్ల లెక్కింపు మిగిలుంది.
Go Back to Shorts
Dubbaka
By Polls
Counting
Raghunandan Rao
BJP
TRS
Congress

More Telugu News