KTR: హైదరాబాద్‌లో వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్, మల్లారెడ్డి.. ఎన్నో ఉపయోగాలు

  • జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో ప్రారంభం
  • జీహెచ్‌ఎంసీతో పాటు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ కలిసి ఏర్పాటు
  • మునిసిపల్‌ వ్యర్థాలతో 9.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
  • పర్యావరణానికి నష్టం కలగకుండా విద్యుత్‌ ఉత్పత్తి  
KTR  along with Minister malla reddy  formally inaugurated   Waste to Energy  plant

హైదరాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో  ఈ రోజు ఉదయం వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ను తెలంగాణ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ కలిసి మునిసిపల్‌ వ్యర్థాలతో 9.8 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే ఈ ప్లాంటును నిర్మించాయి.  పర్యావరణానికి నష్టం కలగకుండా రెఫ్యూజ్‌ డీరైవ్డ్‌ ఫ్యూల్‌, ఆర్‌డీఎఫ్ తో విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు.

బెల్జియంకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్లాంటును ఏర్పాటుచేసినట్లు సంబంధిత అధికారులు మీడియాకు చెప్పారు. దీని నుంచి విద్యుత్ ఉత్పత్తికి దీని కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. మరోవైపు, 14.5 మెగావాట్ల సామర్థ్యంగల మరో ప్లాంటును దుండిగల్‌లోని టీఎస్‌ఐఐసీ స్థలంలో ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News