బీహార్ లో పెరిగిన ఉత్కంఠ... ఆధిక్యంలో మహా ఘటబంధన్ కు దగ్గరగా ఎన్డీయే!
- 109 చోట్ల ఎన్డీయే, 115 చోట్ల మహా ఘటబంధన్ ఆధిక్యం
- 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎల్జేపీ
- కింగ్ మేకర్ గా మారనున్న చిరాగ్
తాజా సమాచారం మేరకు ఎన్డీయే అభ్యర్థులు 109 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ 60 చోట్ల, జేడీయూ 42 చోట్ల, ఎన్డీయేలోని ఇతర పార్టీలు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహా ఘటబంధన్ అభ్యర్థులు 115 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఆర్జేడీ 72 స్థానాల్లో కాంగ్రెస్ 31 స్థానాల్లో, సీపీఐ (ఎంఎల్) 7 చోట్లు, మహా ఘటబంధన్ లోని ఇతర పార్టీలు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం సైతం ఒక స్థానంలో సత్తా చాటేలా కనిపిస్తోంది. ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఎల్జేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో చిరాగ్ కింగ్ మేకర్ అవుతారా? అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.