Trail Blazers: మహిళల టీ20 చాలెంజ్ విజేత ట్రెయిల్ బ్లేజర్స్

  • ఫైనల్లో సూపర్ నోవాస్ పై 16 పరుగుల తేడాతో విక్టరీ
  • మొదట బ్యాటింగ్ చేసిన ట్రెయిల్ బ్లేజర్స్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసిన బ్లేజర్స్
  • లక్ష్యఛేదనలో 102 పరుగులు చేసిన సూపర్ నోవాస్
Trail Blazers won the womens t20 challenge trophy

షార్జాలో జరిగిన మహిళల టీ20 చాలెంజ్ ఫైనల్లో స్మృతి మంథన సారథ్యంలోని ట్రెయిల్ బ్లేజర్స్ ఘనవిజయం సాధించింది. సూపర్ నోవాస్ తో జరిగిన మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఈ టోర్నీలో విజేతగా అవతరించింది.

ఈ టైటిల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ట్రెయిల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. అయితే లక్ష్యఛేదనలో హర్మన్ ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హర్మన్ ప్రీత్ 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన హర్మన్ ప్రీత్ తగిన మూల్యం చెల్లించింది. ట్రెయిల్ బ్లేజర్స్ బౌలర్లలో సల్మా ఖాతూన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు.

More Telugu News