Radha Yadav: మహిళల టీ20 చాలెంజ్ ఫైనల్: రాధా యాదవ్ అద్భుత బౌలింగ్... ట్రెయిల్ బ్లేజర్స్ స్వల్ప స్కోరు

Radha yadav fifer restricts Trail Blazers for a low score
  • షార్జాలో మహిళల టీ20 చాలెంజ్ ఫైనల్
  • మొదట బ్యాటింగ్ చేసిన ట్రెయిల్ బ్లేజర్స్
  • 5 వికెట్లు తీసిన రాధా యాదవ్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసిన ట్రెయిల్ బ్లేజర్స్
షార్జాలో మహిళల టీ20 ఫైనల్లో సూపర్ నోవాస్ బౌలర్ రాధా యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ట్రెయిల్ బ్లేజర్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రెయిల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంథన 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 68 పరుగులు చేసింది.

స్మృతి ఆడుతున్నంత సేపు భారీ స్కోరు దిశగా పయనిస్తున్నట్టు కనిపించిన ట్రెయిల్ బ్లేజర్స్, ఆమె అవుటయ్యాక టపటపా వికెట్లు కోల్పోయింది. సూపర్ నోవాస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధ 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. పూనమ్ యాదవ్, సిరివర్ధనే చెరో వికెట్ తీశారు.

బ్లేజర్స్ జట్టులో స్మృతి, మరో ఓపెనర్ డయాండ్రా డాటిన్ (20), రిచా ఘోష్ (10) మినహా మిగిలిన వాళ్లెవ్వరూ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు.
Radha Yadav
Supernovas
Trail Blazers
Sharjah
Women T20 Challenge

More Telugu News