China: 'అమెరికాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది' అంటూ బైడెన్ ఎన్నికపై స్పందించేందుకు నిరాకరించిన చైనా

  • బైడెన్ గెలుపును గుర్తించని చైనా
  • అమెరికా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని వెల్లడి
  • ఫలితాలు వస్తేనే స్పందిస్తామన్న చైనా విదేశాంగ శాఖ
China says US election result yet to come

ఏ అంశంలోనైనా చైనా తీరే వేరు! అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ కు అనేక దేశాలు అభినందనలు తెలుపుతుంటే చైనా మాత్రం ఈ విషయంలో స్పందించేందుకు నిరాకరించింది. బైడెన్ ఎన్నికైనట్టు ఇప్పుడే గుర్తించలేమని, అమెరికాలో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోందంటూ తనదైనశైలిలో బదులిచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉందంటూ వ్యాఖ్యానించింది.

అయితే, అమెరికా ఎన్నికల్లో తానే గెలిచానంటూ బైడెన్ ప్రకటించుకున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మాట్లాడుతూ, "అమెరికా చట్టాలు, విధానాలు అనుసరించి ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పుడే మేం స్పందిస్తాం" అని వెల్లడించారు.

More Telugu News