Rana Daggubati: పవన్ కల్యాణ్ తో సినిమా చేయడంపై రానా స్పందన!

Rana responds over the charecter in Pawan Kalyans movie
  • ప్రస్తుతం 'విరాటపర్వం'లో నటిస్తున్న రానా
  • పవన్ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు
  • అడిగిన మాట నిజమేనన్న రానా
  • ఇంకా ఏదీ ఫైనల్ కాలేదంటూ జవాబు  
ఇటీవలే తన ప్రియురాలు మహీకను వివాహమాడి ఓ ఇంటివాడైన హీరో రానా దగ్గుబాటి ఇప్పుడు మళ్లీ షూటింగులతో బిజీ కానున్నాడు. ఈ క్రమంలో పలు కథలు కూడా వింటున్నాడు. ప్రస్తుతం తాను చేస్తున్న 'విరాటపర్వం' సినిమా కాకుండా, బాబాయ్ వెంకటేశ్ తో కలసి ఓ మల్టీ స్టారర్ చేయడానికి ఓకే చెప్పాడు. ఇది వచ్చే ఏడాది సెట్స్ కి వెళుతుంది. 

ఇక ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తో కలసి రానా ఓ చిత్రంలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నారు. ఇందులో మరో కీలక పాత్రను రానా చేయనున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి.

దీనిపై తాజాగా రానా స్పందించాడు. 'అవును.. పవన్ కల్యాణ్ గారి సినిమాలో పాత్ర ప్రపోజల్ నా వద్దకు వచ్చింది. అయితే, ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఆ పాత్ర చేయడం అంటే నాకు కూడా ఇష్టమే' అని చెప్పాడు.
Rana Daggubati
Pawan Kalyan
Venkatesh Daggubati

More Telugu News