Bhavani: విశాఖ లేడీ కానిస్టేబుల్ మృతి వ్యవహారంలో భర్తే హంతకుడు!

Police knows husband is the killer of Vizag lady cop Bhavani
  • నక్కపల్లి పోలీస్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ భవానీ మృతి
  • ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసిన భర్త
  • అతడే చంపాడని తేల్చిన పోలీసులు
కొన్నిరోజుల కిందట విశాఖపట్నం నక్కపల్లి పోలీస్ క్వార్టర్స్ లో నాగళ్ల భవానీ అనే మహిళా కానిస్టేబుల్ విగతజీవిగా కనిపించడం సంచలనం సృష్టించింది. మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతుండడంతో ఆత్మహత్య చేసుకుందని భావించారు. ఆమె భర్త సింహాద్రి కూడా ఆత్మహత్య అనే చెప్పాడు. వివాహేతర సంబంధం బట్టబయలవడంతో అవమానంతో ఉరేసుకుని చనిపోయిందని అందరినీ నమ్మించే యత్నం చేశాడు.

అయితే, పోలీసుల దర్యాప్తులో ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అని స్పష్టమైంది. ఆమె భర్త సింహాద్రి ఈ హత్య చేసినట్టు గుర్తించారు. భవానీ తలపై గట్టిగా మోది, ఆపై ఫ్యాన్ కు ఉరేసినట్టు వెల్లడైంది. వివాహేతర సంబంధం మోజులో తనను, పిల్లలను భవానీ పట్టించుకోవడం లేదని అనుమానం పెంచుకున్న సింహాద్రి ఆమెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం సింహాద్రి పోలీసుల అదుపులో ఉన్నాడు.
Bhavani
Lady Cop
Murder
Husband

More Telugu News