Rahul Gandhi: ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్... ఇది నిజం, ఇదే నిజం అంటూ ఆగ్రహం!

Congress leader Rahul Gandhi responds to Aishwarya Reddy suicide
  • ప్రతిభావని ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య
  • లాక్ డౌన్ వల్లే తమకీ దుస్థితి వచ్చిందన్న కుటుంబ సభ్యులు
  • ఐశ్వర్య కుటుంబ సభ్యుల వ్యాఖ్యలకు రాహుల్ సమర్థన
పది, ఇంటర్ పరీక్షల్లో స్టేట్ ర్యాంకులు సాధించి, ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న తెలంగాణ ప్రతిభావని ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక, ఐశ్వర్య విద్యకు అవసరమైన డబ్బును సమకూర్చలేకపోయామని ఆమె కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు రాహుల్ మద్దతు పలికారు. వారి వ్యాఖ్యలతో మీడియాలో వచ్చిన కథనాన్ని రాహుల్ ట్విట్టర్ లో పంచుకున్నారు. "ఇది నిజం, ఇదే నిజం" అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్ డౌన్ ద్వారా బీజేపీ ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిందని మండిపడ్డారు.

ఇది నిజంగా అత్యంత విచారకరమైన సమయం అని, ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Rahul Gandhi
Aishwarya Reddy
Suicide
Lockdown

More Telugu News