Oxford: ఆస్ట్రేలియాలో ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభం

  • కొవిషీల్డ్ పేరిట వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా
  • ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఎల్ లిమిటెడ్ తో ఒప్పందం
  • 30 మిలియన్ డోసులు ఉత్పత్తి చేయనున్న సీఎస్ఎల్ లిమిటెడ్
Oxford corona vaccine production begins in Australia

తీవ్రంగా కలవరపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ ప్రారంభం కావడం నిజంగా శుభవార్తే. ఈ వ్యాక్సిన్ ను ఆస్ట్రేలియాలో ఇవాళ్టి నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఎల్ లిమిటెడ్ తో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా 30 మిలియన్ డోసుల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

2021 మార్చి నాటికి ఈ వ్యాక్సిన్ ఆస్ట్రేలియా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు. దేశ జనాభాలో అత్యధికులకు వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించారు. దీనిపై ఆస్ట్రేలియా మీడియా సంస్థ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ స్పందిస్తూ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియకు 50 రోజుల సమయం పట్టనుందని వెల్లడించింది. కాగా, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై ఆస్ట్రేలియాలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డిసెంబరు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు.

More Telugu News