Bandi Sanjay: కేసీఆర్ కు బొంద పెడతాం: బండి సంజయ్

We will show our power in GHMC elections says Bandi Sanjay
  • లాడెన్, బాబర్ ల వారసుడు కేసీఆర్
  • పేదలను కేసీఆర్ పరామర్శించడం లేదు
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ కు చుక్కలు చూపిస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టార్గెట్ చేశారు. కేసీఆర్ ను ఒక నియంతగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో బియ్యం, డబుల్ బెడ్రూమ్, రోడ్లు, టాయిలెట్లు, లైట్లు ఇలా అన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని చెప్పారు. అన్నీ కేంద్రం ఇస్తున్నప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడో చెప్పాలని ఎద్దేవా చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామని సంజయ్ అన్నారు. వరదలకు బంగ్లాలు మునగలేదు కాబట్టే ఇంటి నుంచి కేసీఆర్ బయటకు రాలేదని విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క ఇంటినీ సర్వే చేయాలని... బాధితులందరికీ నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ అంటే ముమ్మాటికీ హిందువుల పార్టీ అని బండి సంజయ్ చెప్పారు. తాము ఛత్రపతి శివాజీ వారసులమని... కేసీఆర్ మాత్రం లాడెన్, బాబర్ వారసుడని విమర్శించారు. ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్ కు బొంద పెడతామని... హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు బుద్ధి చెపుతామని అన్నారు. పేదలు కష్టాల్లో ఉన్నా పరామర్శించకపోవడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని చెప్పారు.
Bandi Sanjay
BJP
KCR
TRS

More Telugu News