twinkle khanna: హీరో అక్ష‌య్ కుమార్ భార్యపై నెటిజన్ వ్యాఖ్యలు.. గట్టిగా స‌మాధానం ఇచ్చిన ట్వింకిల్

twinkle khanna fires on netizen
  • ‘కాంచ‌న’ సినిమాకు రీమేక్‌గా లక్ష్మి సినిమా
  • అందులో థర్డ్ జెండర్ పాత్రలో అక్షయ్
  • ఆ రూపంలో ట్వింకిల్ ఖ‌న్నా ఫొటో మార్ఫింగ్
  • నీలి రంగు శరీరంతో, ఎర్ర‌టి బొట్టు పెట్టుకుని కనపడుతోన్న ట్వింకిల్
తెలుగు, త‌మిళ‌ భాషల్లో హిట్ కొట్టిన ‘కాంచ‌న’ సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ హీరోగా దర్శకుడు రాఘవ లారెన్స్ రూపొందించిన ‘లక్ష్మి’ సినిమా విడదలకు సిద్ధమైన నేపథ్యంలో కొందరు నెటిజన్లు  అక్ష‌య్ కుమార్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా ఫొటోని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు.
ఆ ఫోటోపై ట్వింకిల్ బాంబ్ అని రాశారు. ఈ సినిమాలో అక్షయ్ కనపడిన పాత్రలో ట్వింకిల్ శ‌రీరాన్ని మార్ఫింగ్ చేశారు. ఆమె ఇందులో నీలి రంగు శరీరంతో, ఎర్ర‌టి బొట్టు పెట్టుకుని కనపడుతోంది.  

ఈ విషయాన్ని గుర్తించిన ట్వింకిల్ ఖన్నా దాన్ని పోస్ట్ చేస్తూ గట్టిగా సమాధానం ఇచ్చింది. మంచి ఫొటో కోసం వెతుకుతున్న సమయంలో ఈ ట్రోలింగ్ తనకు చాలా సాయం చేసిందని చెప్పింది. ఒక‌రు ఈ ఫొటోకు తనను ట్యాగ్ చేశారని, థ‌ర్డ్ క్లాస్ ప‌ర్స‌న్‌ అన్నారని, మీరు దేవుడి మీద జోకులేసి ఎగ‌తాళి చేస్తారా? అని కామెంట్ చేశారని చెప్పింది. దేవుళ్ల‌కు జోకులంటే చాలా ఇష్టమని, లేక‌పోతే నిన్నెందుకు (ఆ ఫొటో క్రియేట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి) భూమి మీద‌కు పంపిస్తాడు? అని ప్రశ్నించింది. ఏదేమైనా కొత్త స్కిన్‌టోన్‌తో పాటు పెద్దబొట్టుతో తాను ఈ దీపావ‌ళికి  టపాసులా రెడీ అవుతానని సమాధానం ఇచ్చింది.
twinkle khanna
akshay kumar
Bollywood
Viral Pics

More Telugu News