China: భారత్ లో కలిసి మలబార్ యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్న ఆస్ట్రేలియాకు చైనా వార్నింగ్!

  • భారత్, అమెరికా, జపాన్ దేశాలతో ఆస్ట్రేలియా నౌకా విన్యాసాలు
  • ఆస్ట్రేలియా తగిన మూల్యం చెల్లించక తప్పదన్న చైనా
  • అమెరికా నుంచి ప్రతిఫలమేమీ ఉండదని వ్యాఖ్యలు
China warns Australia for being participated in Malabar drills along with India and USA

బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో భారత్, అమెరికా, జపాన్ నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా పాల్గొంటుండడం పట్ల చైనా గుర్రుగా ఉంది. ఈ నాలుగు దేశాలు తనకు చెక్ పెట్టేందుకే సముద్రంలో విన్యాసాలు చేస్తున్నాయని గ్రహించిన చైనా తన అధికార పత్రికలో అక్కసు వెళ్లగక్కింది. అమెరికా నేతృత్వంలో సముద్ర విన్యాసాలు చేస్తున్న 'తలబిరుసు ముఠా'తో కలిస్తే ఆస్ట్రేలియా 'వాణిజ్యపరమైన బాధ'ను అనుభవించక తప్పదని హెచ్చరించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎంతో దూకుడుగా యుద్ధ నౌకలను చైనా ముంగిట్లోకి పంపిందంటూ తిట్టిపోసింది.

"అమెరికా పథకాల్లో పాలుపంచుకుంటున్నందుకు లాభమేమీ దక్కదన్న విషయాన్ని ఆస్ట్రేలియా అధినాయకత్వం గ్రహించాలి. మలబార్ విన్యాసాలకు బదులుగా అమెరికా నుంచి ఎలాంటి ప్రతిఫలం రాదన్న విషయాన్ని గుర్తించాలి. మలబార్ విన్యాసాల్లో పాల్గొనాలన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు ఆస్ట్రేలియా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది" అని చైనా అధికార పత్రిక ఘాటు వ్యాఖ్యలు చేసింది.

గతంలో చైనా, ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధాలు సజావుగానే ఉండేవి. అయితే, కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తికి కారణమెవరు? అంటూ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించినప్పటి నుంచి చైనా కోపంగా ఉంటోంది.

More Telugu News