Tamilnadu: ఈ తమిళ ఎమ్మెల్యే తన అల్లుడికి సమర్పించుకున్న కానుకలు చూస్తే మతిపోతుంది!

Tamil mla daughter wedding
  • కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే
  • 20 కుటుంబాలకు సరిపడా కానుకలు
  • రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్, ట్రాక్టర్ కూడా ఇచ్చిన వైనం
సాధారణంగా ఆడపిల్ల పెళ్లంటే అల్లుడికి కట్నకానుకలు సమర్పించుకోవడం తెలిసిందే. ఎవరి స్థాయికి తగిన విధంగా వారి లాంఛనాలు ఉంటాయి. అయితే ఓ తమిళ ఎమ్మెల్యే తన కుమార్తె పెళ్లి సందర్భంగా ఇచ్చిన కానుకలు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. 20 కుటుంబాలకు సరిపడా వస్తు సామగ్రిని అయన లాంఛనాల రూపంలో సమర్పించారు.

వాటిలో బియ్యం, పప్పులు, ఉప్పులు నుంచి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్, స్కూటీ, ట్రాక్టర్ వరకు అన్నిరకాల వస్తువులు ఉన్నాయి. ఎల్ఈడీ టీవీ, ఫ్రిజ్, మిక్సీలు, వాషింగ్ మెషీన్లు, గ్రైండర్లు... ఇలా ఓ మినీ షోరూమ్ నే కొలువుదీర్చారు. పెళ్లి కూడా ఓ తిరునాళ్ల తరహాలో అంగరంగ వైభవంగా జరిగింది. వందలమందితో ఊరేగింపులు, విందులు, వినోదాలతో అట్టహాసంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో మీడియాలో సందడి చేస్తోంది.
Tamilnadu
MLA
Daughter
Wedding

More Telugu News