Bandi Sanjay: కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ పూజలు చేస్తున్నారు: బండి సంజయ్ విమర్శలు

Telangana BJP President Bandi Sanjay verbal attacks on CM KCR
  • సికింద్రాబాద్ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు
  • యజ్ఞయాగాలు చేస్తే హిందువులు కాలేరని కేసీఆర్ కు చురక
  • మంత్రులు అహంకారంతో విర్రవీగుతున్నారని వ్యాఖ్యలు
సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కొడుకును ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ పూజలు చేస్తున్నారని అన్నారు. తానే నిజమైన హిందువునని కేసీఆర్ చెప్పుకుంటాడని, కానీ యజ్ఞయాగాలు చేసినంత మాత్రాన నిజమైన హిందువు కాలేరని చురకలంటించారు.

హిందూ దేవుళ్లను అవమానపరిచే ఎంఐఎం పార్టీతో పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు. తన స్వార్థం కోసం కేసీఆర్ హిందువుల్లో చాంపియన్ గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కేబినెట్ లో తాగుబోతులు, తిరుగుబోతులు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు అహంకారంతో విర్రవీగుతున్నారని వ్యాఖ్యానించారు.
Bandi Sanjay
KCR
KTR
CM
Telangana

More Telugu News