Narendra Modi: అద్వానీ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Modi goes to Advani home and convey birthday wishes
  • ఇవాళ అద్వానీ పుట్టినరోజు
  • పార్టీ కురువృద్ధుడికి శుభాకాంక్షలు వెల్లువ
  • అద్వానీపై మోదీ ప్రశంసలు
బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఎల్కే అద్వానీ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ కురువృద్ధుడు అద్వానీ నివాసానికి వెళ్లారు. తన సీనియర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ గారితో గడపడం ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు.

"నా వంటి కార్యకర్తలకు అద్వానీ గారి మద్దతు, మార్గదర్శనం ఎల్లప్పుడూ అమూల్యమే. జాతి నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం ఎనలేనిది" అని మోదీ ట్విట్టర్ లో వెల్లడించారు. కాగా, అద్వానీ నివాసానికి వెళ్లిన మోదీ అక్కడ జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అద్వానీతో కేక్ కట్ చేయించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
Narendra Modi
Advani
Birthday
BJP
India

More Telugu News