Sourav Ganguly: ఇక భయం లేదు... ఐదు నెలల్లోనే మరో ఐపీఎల్: సౌరవ్ గంగూలీ

Another IPL in Just 5 Months says Ganguly
  • యూఏఈలో ముగింపు దశకు ఐపీఎల్
  • 2021లో ఇండియాలోనే పోటీలు
  • ఆటగాళ్ల కోసం బయో బబుల్
  • వెల్లడించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
ఈ సంవత్సరం ఏప్రిల్ - మే మధ్య జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి, చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు తరలిపోయి, అక్కడే విజయవంతంగా ముగింపు దశకు చేరాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం ఐపీఎల్ పోటీలు ఆలస్యంగా జరుగుతాయన్న ఊహాగానాలకు ఆయన తెరదించుతూ, ప్రతి సంవత్సరంలానే, 2021లో ఐపీఎల్ పోటీలు ఏప్రిల్ లోనే ప్రారంభం అవుతాయని, ఇండియాలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.

కరోనా అంటే భయం పోయిందని, ఇందుకు ఐపీఎల్ ఎంతో దోహదపడిందని వ్యాఖ్యానించిన గంగూలీ, ఆటగాళ్ల కోసం బయో బబుల్ ఏర్పాటు చేస్తామని, అప్పటి పరిస్థితిని బట్టి, ప్రేక్షకులను కూడా పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని గంగూలీ వెల్లడించారు. ఇక ఇంగ్లండ్ జట్టు భారత పర్యటన కూడా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Sourav Ganguly
IPL
IPL 2021
India

More Telugu News