Chandrababu: నటుడు కమలహాసన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు

TDP President Chandrababu conveys birthday wishes to Kamal Haasan
  • కమల్ కు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు 
  • భారతదేశ గొప్పనటుల్లో కమల్ ఒకరన్న చంద్రబాబు
  • మరెన్నో దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్ష
ప్రఖ్యాత నటుడు కమలహాసన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కమల్ 66వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కమల్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు.

"భారతదేశ గొప్పనటుల్లో కమలహాసన్ ఎప్పటికీ ఒకరుగా ఉంటారు. ప్రజాక్షేమం, సమాజశ్రేయస్సు పట్ల శ్రద్ధ, ప్రజల పట్ల ఆప్యాయత ఎంతో ప్రశంసనీయం. ఆయన ఈ పుట్టినరోజును మరింత సంతోషంగా జరుపుకోవాలని, మరెన్నో దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు.
Chandrababu
Kamal Haasan
Wishes
Birthday

More Telugu News