ఆంధ్రప్రదేశ్ కరోనా అప్ డేట్: 2,410 పాజిటివ్ కేసులు, 11 మరణాలు

06-11-2020 Fri 18:21
  • గత 24 గంటల్లో 79,601 టెస్టులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కేసులు
  • 2,452 మందికి కరోనా నయం
Andhra Pradesh corona virus update
ఏపీలో గడచిన 24 గంటల్లో 79,601 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,410 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 401 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 11 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,768కి చేరింది.

తాజాగా 2,452 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్ గా ఏపీలో ఇప్పటివరకు 8,38,363 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,09,770 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,825 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్స కొనసాగుతోంది.