Nitish Kumar: ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్ కుమార్ సంచలన ప్రకటన

This is my last election says Nitish Kumar
  • సంచలన ప్రకటనతో ప్రచారాన్ని ముగించిన నితీశ్ కుమార్
  • అంతా మంచిగానే ముగుస్తుందని వ్యాఖ్య
  • ఎన్నికల గిమ్మిక్కు అని విమర్శిస్తున్న విపక్షాలు
బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఇవే తన చివరి ఎన్నికలు అని ఆయన ప్రకటించారు. పూర్ణియాలో తమ పార్టీ జేడీయూ అభ్యర్థి తరపున ప్రచారాన్ని నిర్వహిస్తూ... 'ఎన్నికలకు ఇది చివరి రోజు. ఇది నా చివరి ఎలెక్షన్. అంతా బాగానే ఉంది. మంచిగానే ముగుస్తుంది' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీహార్ లో వేడి పుట్టిస్తున్నాయి.

ఈ వ్యాఖ్యలపై నితీశ్ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి వేసిన ఎత్తుగడ అని అంటున్నారు. ఇలాంటి గిమ్మిక్కులు నితీశ్ గతంలో చాలా చేశారని విమర్శిస్తున్నారు. దీనిపై జేడీయూ నేతలు మాట్లాడుతూ, విపక్ష నేతల ఆరోపణలను ఖండించారు.
Nitish Kumar
Bihar
Last Election
JDU

More Telugu News