Guntur District: భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. గుంటూరు మాజీ ఎమ్మెల్యే హసన్ అలీ కుమారుడి దుర్మరణం

Guntur Ex MLA Hasan Ali son died in Road Accident in Nalgonda dist
  • గుంటూరు నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై ప్రయాణం
  • రోడ్డు పక్కన ఆపిన బైక్‌ను ఢీకొన్న కారు
  • ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్న షారూఖ్ స్నేహితుడు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే హసన్ అలీ కుమారుడు షేక్ షారూఖ్ (22) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్నేహితుడు ఫయాజ్‌తో కలిసి షారూఖ్ ద్విచక్ర వాహనంపై గుంటూరు నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్దకు రాగానే చలి ఎక్కువ కావడంతో స్వెట్టర్ ధరించేందుకు క్రాస్‌రోడ్డు వద్ద బైక్ ఆపి ఫయాజ్ కిందికి దిగాడు.

అదే సమయంలో చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై కూర్చున్న షారూఖ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఫయాజ్ మాత్రం ప్రమాదం నుంచి ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షారూఖ్ మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Guntur District
Nalgonda District
Road Accident
Hasan ali

More Telugu News