Coconuts: డబ్బుకు బదులు కొబ్బరికాయలే ఫీజు... ఇండోనేషియా కాలేజీల కీలక నిర్ణయం!

Indonesian colleges decides to take coconuts as fees from students amidst corona pandemic
  • ఇండోనేషియాలో ఆర్థిక మాంద్యం
  • కరోనాతో మరింత కుదేలు
  • ఫీజులు చెల్లించలేక విద్యార్థుల అగచాట్లు
  • కొబ్బరికాయలు ఫీజుగా ఇవ్వొచ్చన్న కాలేజీలు
కరోనా దెబ్బకు ప్రపంచంలో చిత్రవిచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పూర్వం నగదు లేని రోజుల్లో వస్తు మార్పిడి ద్వారా వ్యాపారం జరిగేది. ఇప్పుడలాంటి పరిస్థితే ఇండోనేషియాలో కనిపిస్తోంది. అసలే ఆర్థికమాంద్యంతో ఇబ్బందిపడుతున్న ఇండోనేషియాను కరోనా వ్యాప్తి దెబ్బతీసింది. పర్యాటక రంగంపై ఆధారపడిన బాలి వంటి ద్వీపాలు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయాయి. దాంతో అక్కడి విద్యార్థులు కాలేజీలకు ఫీజులు కూడా చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో, నగదుకు బదులుగా కొబ్బరికాయలనే ఫీజులుగా స్వీకరించాలని బాలిలోని కాలేజీలు నిర్ణయించాయి. అనేక ద్వీపాల సమాహారం అయిన ఇండోనేషియాలో కొబ్బరిచెట్లు విపరీతంగా ఉంటాయి. అందుకే కొబ్బరికాయలతో పాటు, ఇతర సహజ ఉత్పత్తులను ఫీజు రూపంలో చెల్లించవచ్చని కాలేజీలు ఉదారంగా స్పందించాయి. కష్టకాలంలో కాలేజీ యాజమాన్యాలు మానవతా దృక్పథంతో స్పందించడం పట్ల తల్లిదండ్రులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Coconuts
Fee
Colleges
Indonesia
Corona Virus

More Telugu News