Jagan: అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుపై జగన్‌ సమీక్ష

Jagan conducts review meeting on Ambedkar Statue
  • పనులు ప్రారంభించిన 14 నెలల్లో పూర్తి కావాలి
  • విగ్రహం చాలా నాణ్యంగా ఉండాలి
  • స్ట్రక్చర్ లో మెరుపు, కళ తగ్గకుండా చూడాలి
విజయవాడలోని అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ లో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... పనులు ప్రారంభించిన 14 నెలల్లోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

విగ్రహం చాలా నాణ్యంగా ఉండాలని చెప్పారు. స్ట్రక్చర్ లో మెరుపు, కళ తగ్గకుండా చూడాలని అన్నారు. గ్రీనరీ బాగుండాలని, చెడిపోకుండా చూడాలని చెప్పారు. అంబేద్కర్ స్మృతివనం వద్ద లైబ్రరీ, గ్యాలరీతో పాటు మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వరాజ్ మైదాన్ వద్ద రోడ్డును విస్తరించి ఫుట్ పాత్ ను అభివృద్ధి చేయాలని చెప్పారు.
Jagan
YSRCP
Ambedkar Statue
Vijayawada

More Telugu News