Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి

Dishas father approaches HC Disha movie
  • 'దిశ ఎన్ కౌంటర్' చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ
  • ఈనెల 26న విడుదల కానున్న చిత్రం
  • రిలీజ్ ను ఆపేయాలని పిటిషన్ వేసిన దిశ తండ్రి
హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని ఎన్ కౌంటర్ చేశారు. మరోవైపు దిశ ఘటన ఉందంతంతో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి 'దిశ ఎన్ కౌంటర్' అనే పేరు పెట్టారు.

అయితే, ఈ సినిమాను ఆపేయాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 26న విడుదలవుతున్న సినిమాను ఆపేయాలంటూ తన పిటిషన్ లో శ్రీధర్ రెడ్డి కోరారు. ఇప్పటికే రిలీజ్ టీజర్ పై సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారని సీసీఎస్ లో కూడా శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నీచమైన మెస్సేజ్ లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Ram Gopal Varma
Tollywood
Disha
Father
TS High Court

More Telugu News