Donald Trump: ఓట్.. ఓట్.. ఓట్!... వైరల్ అవుతున్న ట్రంప్ డ్యాన్సింగ్ వీడియో

Donald Trump dancing video goes viral
  • అమెరికాలో నేడు పోలింగ్
  • పతాకస్థాయికి చేరిన కోలాహలం
  • చివరి సభలో హుషారుగా స్టెప్పులేసిన ట్రంప్
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల కోలాహలం పతాకస్థాయికి చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కు ముందు రోజు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయోవాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రత్యర్థి జో బైడెన్ పై చివరిసారి విమర్శల వర్షం కురిపించి, ఆపై తనదైన శైలిలో డ్యాన్స్ చేశారు. 'వైఎంసీఏ' సాంగ్ తో అమెరికన్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో అనేక సభల్లో తాను డ్యాన్స్ చేసిన క్లిప్పింగ్స్ ను కలిపి ఓ వీడియోగా రూపొందించారు. ఈ డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన సభల్లో ఆద్యంతం ఛలోక్తులు విసురుతూ, హుషారుగా ఉండే ట్రంప్ పోలింగ్ ముంగిట ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ఓట్... ఓట్.. ఓట్ అంటూ ఈ డ్యాన్స్ వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో స్వయంగా పంచుకున్నారు.
Donald Trump
Dance
YMCA

More Telugu News