ముసావీ కుటుంబంలో 20రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడం బాధాకరం: చంద్రబాబు

Chandrababu pays tributes to Musavis family
  • విజయవాడ లాయర్ ముస్తావీ ఇంట్లో విషాదం
  • 20 రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మృతి
  • ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు
విజయవాడలో సీనియర్ అడ్వకేట్ సుల్తాన్ ముసావీ కుటుంబమంతా కరోనా బారిన పడి మృతి చెందిన ఘటన అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఆవేదనను వ్యక్తం చేశారు. కుటుంబంలో 20 రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. ముసావీతో పాటు తల్లి, భార్య, కొడుకు ప్రాణాలు కోల్పోవడం ఆవేదనను కలిగించిందని అన్నారు.

 కరోనా ఏ విధంగా జన జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందో చెప్పడానికి ఈ విషాదమే తార్కాణమని చెప్పారు. సుల్తాన్ ముసావీ కుమార్తెకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఇంతటి విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆమెకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
telu
Vijayawada
Lawyer Musavi

More Telugu News