Pick Pocketer: మంత్రి మేకపాటి కార్యక్రమంలో జేబుదొంగల చేతివాటం!

Pick pocketers at minister Mekapati review program
  • ఇటీవల ఏఎస్ పేట దర్గాను సందర్శించిన మంత్రి
  • అధికారులు, నేతలతో సమీక్ష
  • రెచ్చిపోయిన జేబుదొంగలు
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేట దర్గాను సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన అధికారులు, నేతలతో సమీక్ష నిర్వహించగా, ఇదే అదనుగా జేబుదొంగలు రెచ్చిపోయారు. అందిన కాడికి జేబులు కత్తిరించిపారేశారు. ఎక్కువగా కార్యకర్తలే జేబుదొంగల ప్రతాపానికి గురయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత గుల్లయిన తమ జేబులు చూసుకుని లబోదిబోమన్నారు.

సుమారు లక్ష రూపాయల మేర నగదు జేబుదొంగల పాలైనట్టు గుర్తించారు. దాంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లో జేబుదొంగలు హల్ చల్ చేయడం తెలిసిందే.
Pick Pocketer
Mekapati Goutham Reddy
AS Peta
YSRCP Workers
Nellore District

More Telugu News