శ్రీనగర్ లో హిజ్బుల్ ముజాహిదిన్ చీఫ్ హతం
- జమ్మూ కశ్మీర్ లో భద్రతా దళాలకు భారీ విజయం
- రంగ్రెథ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్
- భద్రతా బలగాలను చూసి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
ఈ ఉదయం రంగ్రెథ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాయి. ఓ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలు తమను సమీపిస్తుండడంతో కాల్పులు ప్రారంభించారు. దాంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరపడంతో హిజ్బుల్ ముజాహిదిన్ అగ్రనేత సైఫుల్లా మరణించాడు.
పుల్వామాలోని మలంగ్ పురా ప్రాంతానికి చెందిన సైఫుల్లా 2014లో హిజ్బుల్ ఉగ్రమూకలో చేరాడు. అతడిని ఘాజీ హైదర్ అని, డాక్టర్ సాబ్ అని పిలుస్తుంటారు. ఈ ఏడాది మే నెలలో రియాజ్ నాయికూ హతమైన తర్వాత అతడి స్థానంలో సైఫుల్లా హిజ్బుల్ బాధ్యతలు చేపట్టాడు.