Narendra Modi: యూపీలో డబుల్ యువరాజులను ఓడించాం.. ఇక్కడా ఓడిస్తాం: మోదీ

modi slams mahakootami
  • రాహుల్, అఖిలేశ్, తేజస్వీపై విమర్శలు 
  • బిహార్ ఎన్నికల్లో మహాకూటమిని ఓడిస్తాం
  • తేజస్వీ యాదవ్‌ ‘ఆటవిక పాలన అందించే యువరాజు’
  • ప్రజల ముందు ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం ఉంది
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లను ఉద్దేశించి పరోక్షంగా వారిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.  ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో డబుల్ యువరాజులపై తమ పార్టీ గెలిచిందని చెప్పారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలోనూ ఇక్కడ ఇద్దరు యువరాజులు తమ రాజ్యం కోసం పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. బీహార్‌లోనూ వీరి ఓటమి ఖాయమేనని చెప్పారు.  

తేజస్వీ యాదవ్‌ను‌ ‘ఆటవిక పాలన అందించే యువరాజు’ అని మోదీ అభివర్ణించారు. బీహార్‌లో ప్రజల ముందు ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం ఉందని, తమకు వ్యతిరేకంగా డబుల్ డబుల్ యువరాజులు ఉన్నారని చెప్పారు. తమ డబుల్ ఇంజన్ ఎన్డీయే రాష్ట్రంలో అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. కాగా, బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల కోసం ఎన్డీఏ, మహాకూటమి నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
Narendra Modi
BJP
bihar

More Telugu News