సీనియర్ నటుడి దర్శకత్వంలో నాగ చైతన్య!

31-10-2020 Sat 21:24
  • యాక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్న అర్జున్ 
  • అక్కినేని నాగ చైతన్యకు కథ చెప్పిన వైనం
  • కథ నచ్చడంతో చైతూ గ్రీన్ సిగ్నల్  
Senior actor to direct Akkineni hero

యాక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్న సీనియర్ నటుడు అర్జున్ గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడలో హీరోగా తన కెరీర్ని ప్రారంభించి, అటు తమిళంలో కూడా పలు సినిమాలు చేశాడు. ఆ తర్వాత తెలుగులో ప్రవేశించి పలు యాక్షన్ సినిమాలలో నటించి ఇక్కడ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తదనంతర కాలంలో దర్శకుడిగా.. నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేశాడు అర్జున్.

ఇప్పుడీ సీనియర్ హీరో తెలుగులో అక్కినేని వారసుడు నాగ చైతన్యను డైరెక్ట్ చేయనున్నాడంటూ తాజాగా వార్తలొస్తున్నాయి. ఇటీవల చైతూని కలసి, ఆయన కథ చెప్పారనీ, అది చైతూకి బాగా నచ్చిందని అంటున్నారు. దాంతో ప్రాజక్టుకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం వుంది.

 ఇదిలా ఉంచితే, చైతూ తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చిత్రాన్ని పూర్తిచేశాడు. మరోపక్క, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే చిత్రాన్ని ప్రారంభించాడు.