ఏపీ కరోనా అప్ డేట్: 2,783 పాజిటివ్ కేసులు, 14 మరణాలు

31-10-2020 Sat 17:49
  • గత 24 గంటల్లో 82,045 కరోనా టెస్టులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 34 కేసులు
  • తాజాగా 3,708 మందికి కరోనా నయం
Andhra Pradesh state Covid update

ఏపీలో కరోనా పరిస్థితులపై తాజా బులెటిన్ వెలువడింది. గడచిన 24 గంటల్లో 82,045 కరోనా టెస్టులు నిర్వహించగా... 2,783 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 469 కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 34 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 34 మంది కరోనాతో మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,690కి పెరిగింది. తాజాగా 3,708 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,23,348 మందికి కరోనా సోకగా, వారిలో 7,92,083 మంది వైరస్ నుంచి విముక్తులయ్యారు. ఇంకా 24,575 మందికి చికిత్స కొనసాగుతోంది.