ఆ కుర్రాడు సీఎం అయిపోయినా ఆశ్చర్యం లేదు: సంజయ్ రౌత్
- కుటుంబ సభ్యులు జైళ్లలో ఉన్నా తేజశ్వి కదం తొక్కుతున్నాడు
- బీహార్ లో అందరికీ సవాల్ విసురుతున్నాడు
- బీజేపీకి ఈసీ ఒక విభాగం వంటిది
ఎన్నికల తర్వాత ఆ కుర్రాడు బీహార్ ముఖ్యమంత్రి అయిపోయినా ఆశ్చర్యం లేదని సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. బీహార్ లో అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని ఈసీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారత ఎన్నికల సంఘం బీజేపీకి ఒక విభాగం వంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసీ నుంచి ఆశించడానికి ఏమీ లేదని అన్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు.