నెటిజన్‌కు చురకలంటించిన సినీనటుడు సోనూసూద్!

31-10-2020 Sat 13:04
  • తనకు మాల్దీవులు వెళ్లాలని ఉందన్న నెటిజన్
  • తనకు సాయం చేయాలని  సోనూసూద్‌కు ట్వీట్
  • సైకిల్ కావాలా? రిక్షా కావాలా? అని అడిగిన సోను
sonu sood replays to netizen

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పేదలకు సాయపడి అందరితోనూ శభాష్ అనిపించుకున్న సినీనటుడు సోనూసూద్ అనంతరం కూడా తన సాయాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఆయనను  రియల్ హీరో అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా సాయం కోరిన వారికి ఆయన అభయమిస్తూ వారి కష్టాలను తీరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనకు కొందరు నెటిజన్లు సరదాగా ట్వీట్లు చేస్తూ వింత కోరికలు కోరుతున్నారు. వాటికి కూడా సోనూసూద్ స్పందిస్తూ వారికి చురకలంటిస్తున్నారు. తాజాగా, తనకు మాల్దీవులు వెళ్లాలని ఉందని, తనకు సాయం చేయాలని సోనూసూద్‌కు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి సోనూ తనదైన శైలిలో స్పందిస్తూ మాల్దీవులకి వెళ్లడానికి సైకిల్ కావాలా? రిక్షా కావాలా? అని అడిగాడు. సోనూ స్పందించిన తీరుకి నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.