Vanitha Vijay Kumar: ముందు మీ జీవితాలను సరిదిద్దుకోండి: వనిత

First you correct your lives says Vanitha Vijay Kumar
  • ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న వనిత
  • మూడో భర్తను కూడా తరిమేసిందంటూ ప్రచారం
  • మీ కుటుంబాల గురించి ఆలోచించుకోవాలంటూ వనిత ఫైర్
వరుస వివాదాలతో సినీ నటి వనిత విజయ్ కుమార్ పేరు ఎప్పటి నుంచో మారుమోగుతోంది. 40 పదుల వయసులో ఉన్న వనిత జూన్ లో మూడో పెళ్లి చేసుకుంది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో పీటర్ పాల్ అనే వ్యక్తిని క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లాడింది. ఈ వివాహ వ్యవహారం కూడా రచ్చ అయింది. ఈ పెళ్లిపై పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వివాహం చేసుకున్నాడంటూ పీటర్ పై ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో, వనితపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

మరోవైపు ఇటీవల ఆమెకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. మూడో భర్తను కూడా ఆమె వదిలేసిందనేదే ఆ వార్త సారాంశం. ఈ జంట ఇటీవలే గోవా ట్రిప్ కు వెళ్లింది. అక్కడ మందు తాగి వనితను పీటర్ కొట్టాడట. దీంతో, చెన్నైకి తిరిగి వచ్చిన వెంటనే ఇంటి నుంచి పీటర్ ను వనిత తరిమేసిందనే ప్రచారం జరుగుతోంది.

దీనిపై వనిత స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన గురించి బాధ పడుతున్నట్టు కొందరు నటిస్తున్నారని... అలాంటి వారికి తాను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానని... ముందు మీ జీవితాలను, కుటుంబాలను సరిదిద్దుకోవాలని చెప్పింది. మీ జీవితాలను బాగుచేసుకున్న తర్వాత తన గురించి ఆలోచిద్దురు గానీ అని వ్యాఖ్యానించింది. తన పట్ల ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించింది.
Vanitha Vijay Kumar
Tollywood
Husband

More Telugu News