విశాఖలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్

30-10-2020 Fri 19:35
  • విశాఖ పార్క్ హోటల్ లో వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం
  • హాజరైన మంత్రులు బొత్స, అవంతి, ఎంపీ విజయసాయి 
AP CM Jagan attends YCP MLA Karanam Dharmasri daughter marriage

ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ఓ శుభకార్యానికి హాజరయ్యారు. విశాఖలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహం నగరంలోని పార్క్ హోటల్ లో జరిగింది. ఈ పెళ్లికి సీఎం జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరయ్యారు. కాగా, సీఎం రాకతో పెళ్లి వేడుకలో సందడి నెలకొంది.