Emmanuel Macron: ముంబయి రోడ్డుపై ఫ్రాన్స్ అధ్యక్షుడి పోస్టర్లు అతికించిన దుండగులు... తొలగించిన పోలీసులు!

  • భేండీ బజార్ రోడ్డుపై దర్శనమిచ్చిన మేక్రాన్ చిత్రాలు
  • తొక్కుకుంటూ రాకపోకలు సాగించిన వాహనాలు, పాదచారులు
  • ఎలాంటి కేసు నమోదు చేయలేదన్న పోలీసులు
France president posters appears on Mumbai busy road

ప్రస్తుతం ఫ్రాన్స్ తీవ్రవాద దాడి నేపథ్యంలో ఉద్రిక్తంగా ఉంది. నైస్ నగరంలో ఓ వ్యక్తి కత్తితో ముగ్గుర్ని చంపేసిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పోస్టర్లు ముంబయి రోడ్లపై దర్శనమిచ్చాయి. ముంబయిలో నిత్యం రద్దీగా ఉండే భేండీ బజార్ రోడ్డులో మేక్రాన్ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. ఓ కార్టూన్ కారణంగా మేక్రాన్ ముస్లిం ప్రాబల్య దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది.

కొన్ని వందల సంఖ్యలో పోస్టర్లు రోడ్డుపై అంటించి ఉండగా, వాటిని తొక్కుకుంటూ వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండడం ఓ వీడియోలో దర్శనమిచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భేండీ బజార్ రోడ్డు వద్దకు చేరుకుని మేక్రాన్ పోస్టర్లను తొలగించారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.

More Telugu News