khushboo: ‘డియర్ రజనీకాంత్ సర్’.. అంటూ సూపర్ స్టార్ ఆరోగ్యంపై ఖుష్బూ ట్వీట్!

Nothing is more important than your good health and happiness says khushboo
  • మాకు మీ ఆరోగ్యం, సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదు
  • మీరు మా మేలిమి వజ్రంలాంటి వారు
  • ఏది చేస్తే మీకు మంచి జరుగుతుందో అదే చేయండి
  • మా జీవితాంతం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై పలు రకాల వార్తలు వస్తోన్న నేపథ్యంలో నిన్న దీనిపై రజనీ స్పందించిన విషయం తెలిసిందే. తన పేరిట ప్రచారం అవుతోన్న ఓ లేఖ తనది కానప్పటికీ,  అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం మాత్రం నిజమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన రజనీకాంత్ సర్.  మాకు మీ ఆరోగ్యం, సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదు. మీరు మా మేలిమి వజ్రంలాంటి వారు.. మీరు మా నిధి. ఆరోగ్య పరంగా, ఇతర విషయాల పరంగా ఏది చేస్తే మీకు మంచి జరుగుతుందో అదే చేయండి. మీపై మాకు ఉన్న ప్రేమను ఏ విషయమూ తగ్గించలేదు. మా జీవితాంతం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము’ అని ఖుష్బూ చెప్పారు.
khushboo
Tamilnadu
Tollywood
Rajinikanth

More Telugu News