చేసిన సవాలు మేరకు ఆ మంత్రి ఇప్పుడు మీసాలు తీస్తారా?: నారా లోకేశ్

30-10-2020 Fri 13:04
  • టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి 
  • ఈ విషయాన్ని జగన్‌కు అధికారులు చెప్పారు
  • 70 శాతం పూర్తని తేలితే మీసాలు తీస్తానని ఓ మంత్రి అన్నారు
lokesh slams ap govt

పోలవరం ప్రాజెక్టు పనుల విషయాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఆ ప్రాజెక్టు పనుల విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జరిపిన సమీక్ష సమావేశంలో అధికారులు పలు విషయాలు తెలిపారని లోకేశ్ అన్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులే చెప్పారని తెలిపారు.

దీంతో టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. 70 శాతం పనులు పూర్తయితే తాను మీసాలు తీసేస్తానని, లేదంటే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీసాలు తీయాలని ఓ మంత్రి ఇటీవల సవాల్ విసిరారని లోకేశ్ గుర్తు చేశారు. 70 శాతం పనులు పూర్తయ్యాయని ఇప్పుడు ఆ పార్టీ నేతలకు స్పష్టమైందని, మరి సవాలు చేసిన ఆ మంత్రి మీసాలు తీస్తారా? అని లోకేశ్ నిలదీశారు.