Lakshmi Manchu: సోదరుడితో కలిసి శ్రీవారిని దర్శించుకుని.. ఫొటో పోస్ట్ చేసిన మంచు లక్ష్మి

Lakshmi Manchu Just finished Tirumala darshan
  • వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో లక్ష్మి, విష్ణు
  • మొక్కులు చెల్లించుకున్న మంచు వారసులు
  • త్వరలో తన సినిమా ‘మోసగాళ్లు’  విడుదలవుతుందన్న విష్ణు
సినీ నటి మంచు లక్ష్మి ఈ రోజు ఉదయం తన సోదరుడు మంచు విష్ణుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వరుని సేవలో పాల్గొన్న వీరిద్దరు మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అలాగే, ఆలయ అధికారులు వారిద్దరికి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం విష్ణుతో లక్ష్మి ఫొటో తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.  

కాగా, స్వామి వారిని దర్శించుకున్న అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడాడు. తిరుపతిలో తన తండ్రి మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా షూటింగ్ ప్రారంభమైందని చెప్పాడు. అలాగే, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో కలిసి తాను నటించిన ‘మోసగాళ్లు’ సినిమా త్వరలోనే విడుదల కానుందని అన్నాడు. ఈ సందర్భంగా తాను స్వామివారిని దర్శించుకున్నానని తెలిపాడు.
Lakshmi Manchu
TTD
manchu vishnu
Mohan Babu
Tollywood

More Telugu News